సికింద్రాబాద్ క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం, బ్రిటీష్ వారి హయాంలో నిర్మాణం
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజిన్ల సాయంతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
దీనితో పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవుదినం కావడంతో శనివారం క్లబ్ తెరవకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. క్లబ్లో అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలిస్తున్న సమయంలో ఆర్మీ అధికారుల కోసం 1878లో సికింద్రాబాద్ క్లబ్‌ను నిర్మించారు. దాదాపు 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. ఈ క్లబ్‌ను కేంద్ర ప్రభుత్వం భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ కూడా విడుదల చేశారు. ఈ క్లబ్లో దాదాపు 300 మంది సిబ్బంది పని చేస్తుండగా.... ఇందులో 5వేల మందికిపైగా సభ్యత్వం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments