కరణ్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం
- IndiaGlitz, [Wednesday,May 01 2019]
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్జోహార్కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్థి నష్టంతో పాటు సదరు నిర్మాణ సంస్థకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలు అగ్నిక అహుతైనట్లు సమాచారం.
1976లో కరణ్ తండ్రి యశ్ జోహార్ ఈ స్టూడియో ప్రారంభించారు. ప్రొడక్షన్కు సంబంధించిన కెమెరాలు, ప్రాపర్టీస్ అన్నింటినీ ఇక్కడే భద్రపరిచారు. అవన్నీ ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయానట్లు సమాచారం. ప్రస్తుతం ఈ బ్యానర్ నుండి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 విడుదలకు సిద్ధంగా ఉంటే.. సూర్యవంశీ, తక్త్, గుడ్ న్యూస్ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.