కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం.. 82 మంది మృతి

  • IndiaGlitz, [Monday,April 26 2021]

కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రమాదాలు మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు జనాలు కోవిడ్ కారణంగా మరణిస్తూ ఉంటే.. మరోవైపు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్లక్ష్యానికి ఏమాత్రం తావు లేకుండా చూసుకోవాల్సిన ఆసుపత్రుల యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఇరాక్‌ దేశంలో ఓ కరోనా ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 82 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 110 మంది కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. బాగ్దాద్‌లోని ఇబన్‌ అల్‌ఖతీబ్‌ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ ఉన్న అంతస్తులో కరోనా బాధితుల కోసం ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో క్షణాల్లో మంటలు ఆసుపత్రి మొత్తం వ్యాపించాయి. ఆక్సిజన్ సిలిండర్ పేలిన సమయంలో ఐసీయూలో వెంటిలేటర్‌పై 28 మంది ఉన్నారు. వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు ఆసుపత్రి మొత్తం దట్టంగా పొగలు వ్యాపించడంతో ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని తేలడంతో ప్రధాని.. వెంటనే ఆరోగ్య మంత్రి హసన్‌ అల్‌ తమిమీని సస్పెండ్‌ చేయడం గమనార్హం.

ప్రమాద సమయంలో ఆసుపత్రిలో చోటు చేసుకున్న పరిణామాలు హృదయాన్ని ద్రవింపజేసేవిగా ఉన్నాయి. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పలువురు ఆక్సిజన్‌ సపోర్ట్‌ మీద ఉన్న రోగులు వాటిని తీసేసి పరుగులు పెట్టడం మనసును కలిచివేశాయి. రోగుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే రక్షించే వ్యవస్థ లేకపోగా, ఫాల్‌ సీలింగ్‌లో వినియోగించిన సామగ్రితో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించాయని దేశ మానవ హక్కుల కమిషన్‌ అధికార ప్రతినిధి అలీ అల్‌–బయతి చెప్పారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.

More News

అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ సందడి

ప్రపంచ సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.

పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాజకీయ, సినీ ప్రముఖులకు

కరోనా ఎఫెక్ట్.. మహిళా కానిస్టేబుల్‌కు స్టేషన్‌లోనే మంగళ స్నానం..

కరోనా మహమ్మారి కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి సెలవులు కూడా దొరకడం లేదు. పెళ్లైనా.. పేరంటమైనా కూడా ఏదో ఒకటి అర సెలవులతో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అన్ని

ఆక్సిజన్‌కు బదులుగా నెబ్యులైజర్ వాడకండి!

ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక చోట పదుల సంఖ్యలో జనం మరణిస్తూనే ఉన్నారు.

సినీ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..

ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య(74) ఇకలేరు. ప్రస్తుతం హైద‌రాబాద్ చిత్ర‌పురి కాల‌నీలో నివాసముంటున్న ఆయ‌న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.