టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం.. తెలంగాణ భవన్లో అగ్నిప్రమాదం
- IndiaGlitz, [Sunday,March 21 2021]
తమ పార్టీ అభ్యర్థి విజయం ఆ పార్టీ కార్యాలయానికి ముప్పు తెచ్చిపెట్టింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యతా ఓట్లతో ఆమె విజయం సాధించారు. ఈ విజయంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వెంటనే క్రాకర్స్ తీసుకొచ్చి పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లో నానా హడావుడి చేశారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో నిప్పురవ్వలు తెలంగాణ భవన్పై పడ్డాయి. దీంతో పైకప్పు తగలబడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదు.
కాగా.. నాలుగు రోజుల సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓటుతో ఆమె ఈ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై మొదటి నుంచి వాణీదేవి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. చివరకు వాణీదేవి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభమైంది. నాలుగు రోజుల సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగిన అనంతరం ఫలితం వాణీదేవికి అనుకూలంగా వచ్చింది.