Green Bawarchi Hotel : రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్లో ఘోర అగ్నిప్రమాదం.. లోపల చిక్కుకుపోయిన 20 మంది
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాయదుర్గంలోని ఐమాక్ ఛాంబర్లోని 2వ అంతస్తులో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండవ అంతస్తులోనే గ్రీన్ బావర్చి హోటల్ వుంది. గ్రీన్ బావర్చి హోటల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భవనంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనం లోపల 20 వరకు చిక్కుకున్నట్లుగా సమాచారం. తమను రక్షించాలంటూ బాధితులు హాహాకారాలు చేస్తున్నారు.
మార్చిలో స్క్రాప్ గౌడౌన్లో అగ్నిప్రమాదం, 11 మంది సజీవ దహనం:
ఇకపోతే.. ఈ ఏడాది మార్చి 23న హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడ స్క్రాప్ గోడౌన్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనమైన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. క్షణాల్లో స్క్రాప్ గోడౌన్ మొత్తం వ్యాపించాయి. దీంతో లోపల నిద్రిస్తున్న కార్మికులకు తప్పించుకునే వీలు లేక మంటలకు ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్ లో 12 మంది కార్మికులు ఉన్నారు. వారిలో ప్రేమ్ అనే కార్మికుడు గోడ దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడు శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉండటంతో పోలీసులు గాంధీకి తరలించారు. కొద్దిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రేమ్ కూడా చికిత్స పొందుతూ మరణించాడు. బాధితులంతా బీహార్‌కు చెందిన వలస కూలీలే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout