విజయవాడ కోవిడ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడలో కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలున్నారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కోవిడ్ సెంటర్లో ఆసుపత్రి సిబ్బంది 10 మంది, కరోనా బాధితులు 30 మంది ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారం టైన్ నడుస్తోంది.
షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించి ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసింది. మంటల కారణంగా పొగ దట్టంగా అలుముకుని ఊపిరి ఆడక బాధితులు కిటికీల్లోంచి కేకలు వేశారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో మంటలు వ్యాపించగా.. మిగతా అంతస్తులకు పొగలు దట్టంగా వ్యాపించాయి. కాగా మొదటి ఫ్లోర్‌లోని నలుగురు వ్యక్తులు కిందకు దూకేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో కిటికీ అద్దాలను పగులగొట్టి బాధితులను కిందకు చేర్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com