అంతా చక్కబడుతున్న వేళ మరో వివాదం.. రాజ్‌ కుంద్రా- శిల్పా శెట్టిపై చీటింగ్‌ కేసు

  • IndiaGlitz, [Monday,November 15 2021]

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుంద్రా- శిల్పాశెట్టిలు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పోర్నోగ్రఫీ కేసుతో రాజ్ కుంద్రా పీకల్లోతు ఇబ్బందుల్లో వున్నారు. అటు శిల్పా సైతం ఈ ఘటన తర్వాత మీడియాకు దూరంగా తన పనేదో తాను చేసుకుంటున్నారు. అంతేకాకుండా రాజ్‌కుంద్రాకు కూడా విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా‌లపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. దాదాపు కోటిన్నర మోసం చేశారంటూ ఓ వ్యాపారవేత్త ఈ దంపతులపై కేసు నమోదు చేశాడు.

కాషిఫ్ ఖాన్ అనే వ్యాపారవేత్త దగ్గర శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు కోటిన్నర తీసుకున్నారట. ఫిట్ నెస్ సెంటర్ ప్రారంభిద్దామని ఒప్పందం కుదుర్చుకున్నారని... కానీ అది కార్యరూపం దాల్చకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని కాషిఫ్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో అతనికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యాపారవేత్త ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల మీద చీటింగ్ కేసు నమోదు చేశాడు. సెక్షన్ 420 (చీటింగ్), 120 B, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.