భీమ్లా నాయక్ రిలీజ్ నాడు జంతు బలి... పవన్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు. ఎవరైనా తమ అభిమాన హీరోని పల్లెత్తు మాటంటే అస్సలు ఊరుకోరు. ఇక వాళ్ల పుట్టినరోజులు, సినిమా విడుదల సందర్భాల్లో జాతర మామూలుగా వుండదు. అన్నదానం, రక్తదానం, సహాయక కార్యక్రమాలు చేస్తూ వుంటారు. అయితే అభిమానుల అత్యుత్సాహం ఒక్కోసారి తారలను చిక్కుల్లో పడేస్తుంది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. పవన్, రానాలు నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎప్పటిలాగే థియేటర్ల వద్ద పవర్‌స్టార్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు, బాణాసంచా కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం కొందరు అభిమానులు రోటీన్‌కు భిన్నంగా వ్యవహరించారు.
భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా కొందరు వ్యక్తులు మేకను బలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అషర్ అనే న్యాయవాది దీనిపై చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, పవర్ స్టార్ అభిమానులపై ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు, ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు.
ఇకపోతే.. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com