గుణశేఖర్ హీరోయిన్ ఎవరో?
Send us your feedback to audioarticles@vaarta.com
తాను తీసే సినిమాలన్నీ చారిత్రాక, పురాణ అంశాల ఆధారంగానే ఉండేలా చూసుకోవడం డైరెక్టర్ గుణశేఖర్‌కు ఉండే అలవాటు. రుద్రమదేవి సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లయిన గుణశేఖర్ తదుపరి సినిమాను రీసెంట్‌గానే అనౌన్స్ చేశాడు. ఆ సినిమానే 'శాకుంతలం'. మరిన్ని రోజులు గుణశేఖర్ ఖాలీగా ఉన్నాడా? అంటే కచ్చితంగాలేదనే చెప్పాలి. ఎందుకంటే రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో 'హిరణ్యకశ్యప్' అనే సినిమాను తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకుంటూ వచ్చాడు. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించాలనకుంటున్న తరుణంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిర్మాతలు చెప్పడమో, మరేదైనా రీజనో ఏమో కానీ.. గుణశేఖర్ 'శాకుంతలం'ను అనౌన్స్ చేశాడు.
మహాభారతంలోని ఆదిపర్వంలోని ఓ ప్రేమకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గుణశేఖర్ తెలిపారు. ఈ సినిమా అనౌన్స్ అయిన తర్వాత నుండి అందులో హీరోయిన్‌గా ఎవరు చేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం పూజా హెగ్డేను డైరెక్టర్ గుణశేఖర్ కాంటాక్ట్ అయితే ఆమె నో చెప్పేసిందని సమాచారం. ఇప్పుడు ఈ క్రియేటివ్ డైరెక్టర్ అనుష్కను సంప్రదించాడని ఆమె కూడా ఇంకా ఓకే చెప్పలేదని టాక్. మరి చివరకు గుణశేఖర్ తెరకెక్కించే ప్రేమకథ 'శాకుంతలం'లో నటించబోయే హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments