గుణశేఖర్‌ హీరోయిన్‌ ఎవరో?

తాను తీసే సినిమాలన్నీ చారిత్రాక, పురాణ అంశాల ఆధారంగానే ఉండేలా చూసుకోవడం డైరెక్టర్‌ గుణశేఖర్‌కు ఉండే అలవాటు. రుద్రమదేవి సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లయిన గుణశేఖర్‌ తదుపరి సినిమాను రీసెంట్‌గానే అనౌన్స్‌ చేశాడు. ఆ సినిమానే 'శాకుంతలం'. మరిన్ని రోజులు గుణశేఖర్‌ ఖాలీగా ఉన్నాడా? అంటే కచ్చితంగాలేదనే చెప్పాలి. ఎందుకంటే రానా దగ్గుబాటి టైటిల్‌ పాత్రలో 'హిరణ్యకశ్యప్‌' అనే సినిమాను తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్‌ పనులను చేసుకుంటూ వచ్చాడు. ప్యాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించాలనకుంటున్న తరుణంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిర్మాతలు చెప్పడమో, మరేదైనా రీజనో ఏమో కానీ.. గుణశేఖర్‌ 'శాకుంతలం'ను అనౌన్స్‌ చేశాడు.

మహాభారతంలోని ఆదిపర్వంలోని ఓ ప్రేమకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గుణశేఖర్‌ తెలిపారు. ఈ సినిమా అనౌన్స్‌ అయిన తర్వాత నుండి అందులో హీరోయిన్‌గా ఎవరు చేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం పూజా హెగ్డేను డైరెక్టర్‌ గుణశేఖర్‌ కాంటాక్ట్‌ అయితే ఆమె నో చెప్పేసిందని సమాచారం. ఇప్పుడు ఈ క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనుష్కను సంప్రదించాడని ఆమె కూడా ఇంకా ఓకే చెప్పలేదని టాక్‌. మరి చివరకు గుణశేఖర్‌ తెరకెక్కించే ప్రేమకథ 'శాకుంతలం'లో నటించబోయే హీరోయిన్‌ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

అక్కడ ఫిక్సయిన 'పుష్ప'.. నిర్మాతలేం చేశారంటే?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

బయోపిక్‌లో రానా దగ్గుబాటి..?

ఇండియన్‌ సినిమాల్లో బయోపిక్స్‌ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. సినీ, రాజకీయం, క్రీడలు ఇలా పలు రంగాల్లోని కీలక వ్యక్తుల బయోపిక్స్‌ రూపొందుతున్నాయి.

తిండి విషయంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' యూనిట్‌ తీసుకున్న నిర్ణయం

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)'.

అనుష్క విషయంలో తప్పులో కాలేసిన గూగుల్..

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ విషయంలో గూగుల్ తప్పులో కాలేసింది.

జస్టిస్ ఎన్వీ రమణపై యుద్ధంలో సీఎం జగన్ గెలుస్తారా?

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సర్కార్ యుద్ధం ప్రకటించింది.