‘ఇండియన్ 2’ షూటింగ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందవేత
Send us your feedback to audioarticles@vaarta.com
కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `ఇండియన్ 2`. ఈ సినిమా షూటింగ్ సమయం జరుగుతున్నప్పుడు ఫిబ్రవరిలో అపశృతి చోటు చేసుకుంది. సెట్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై సిటీకి దూరంగా ఉండే ఈవీపీ స్టూడియోలో సినిమా కోసం లైటింగ్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సెట్లో ఉన్న క్రేన్ తెగిపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు ఆగిపోయిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. మధ్యలో మొదలు పెట్టాలనుకున్నా.. కరోనా ఎఫెక్ట్ మొదలు కావడంతో షూటింగ్ ప్లాన్స్ ఆగిపోయాయి.
ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయలు, డైరెక్టర్ శంకర్ శంకర్ కోటి రూపాయలు, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి కుటుంబాలకు ఈ సాయాన్ని అందజేశారు. ఓ మీటింగ్‌ను ఏర్పాటు చేసిన బాధిత కుటుంబాల్లోని వ్యక్తులను కమల్‌హాసన్, శంకర్, సహా లైకా ప్రతినిధులు కలిసి వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. ఇకపై తన సినిమాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని శంకర్ చెబుతూ శంకర్ ఎమోషనల్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com