బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదా.. మాకు ఫిర్యాదు చేయండి!
Send us your feedback to audioarticles@vaarta.com
న్యూ ఢిల్లీ: బ్యాంకుల్లో రుణాలు ఇవ్వట్లేదని జనాలు నానా తంటాలు పడుతుంటారు. ఇదిగో ఇస్తాం.. అదుగో ఇస్తామంటూ బ్యాంక్ చుట్టూ తిప్పుకుంటున్న సందర్భాలు ఎన్నో ఎదురుచూసుంటారు. మరీ ముఖ్యంగా లోన్లు ఇప్పిస్తామని చెప్పి మధ్యవర్తులు డబ్బులు నొక్కేసి ఆ తర్వాత అడ్రస్ లేకుండా ఘటనలు ఎన్నో ఉన్నాయ్. మరీ ముఖ్యంగా.. రుణాలు తీసుకోవడానికి వ్యక్తి అర్హుడైనప్పటికీ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటుంటారు. అయితే ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందించారు.
ఫిర్యాదు చేయండి!
‘బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే మాకు ఫిర్యాదు చేయండి. ఆర్ధిక మూలాలు బాగున్నందునే అధికస్థాయిలో విదేశీ మారక నిల్వలు బ్యాంకులు తమ సంబంధీకులకు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా రుణాలు ఇవ్వడంతో నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగాయి. అనవసరమైన ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. మౌలికసదుపాయాల్లో పెట్టుబడుల ద్వారా ఆస్తుల సృష్టి ఉంటుంది’ అని నిర్మలా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com