ప్రతిపక్షాల నిరసనల నడుమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..

ప్రతిపక్షాల నిరసనల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ ఓజ్లా నల్లటి దుస్తుల్లో వచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులకు మద్దతుగా నల్ల దుస్తుల్లో ఆయన రావడం గమనార్హం. తొలిసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను నిర్మల ప్రవేశ పెట్టారు. ట్యాబ్‌లో చూసి బడ్జెట్‌‌ను చదివేశారు. కేంద్ర బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు యత్నించాయి. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామన్నారు. ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్‌లతో సమానమని నిర్మల తెలిపారు. పీఎం గరీబ్ యోజన పేదలకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. కోవిడ్‌ యోధులందరికీ నిర్మలా సీతారామన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిపై ప్రభావం పడిందన్నారు. ఆర్థికాభివృద్ధికి వ్యాక్సినేషన్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మరో కొత్త ప్రపంచంలో ఉన్నామన్నారు. దేశం మూలాల్లోనే ఆత్మనిర్భర్‌ భావం ఉందని నిర్మల పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం కృష్టి చేస్తామన్నారు.

More News

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే అన్నాడీఎంకే నేతలకు షాక్ ఇచ్చిన శశికళ

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే శశికళ అన్నాడీఎంకే నేతలకు షాక్ ఇచ్చారు.

త‌మ కొడుక్కి సోనూసూద్ పేరు పెట్టుకున్న తెలంగాణ దంప‌తులు

కోవిడ్‌ ముందు కేవలం నటుడిగానే అందరికీ సుపరిచితుడైన సోనూసూద్‌.. కోవిడ్‌ తర్వాత హీరో అయ్యాడు.

మ‌హేశ్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ...!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ తాజా చిత్రం స‌ర్కారువారిపాట‌. మహేశ్ 27వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్నాడు.

వ‌రుణ్‌తేజ్‌ను క‌లిసేందుకు 200 కిమీ న‌డిచిన అభిమాని

మెగాప్రిన్స్‌ను క‌ల‌వ‌డానికి తెలంగాణకు చెందిన ఓ అభిమాని 200 కి.మీ దూరం న‌డుచుకుంటూ వ‌చ్చాడు.

డైరెక్ట‌ర్ శంక‌ర్‌కి నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కి చెన్నై ఎగ్మోర్ మేజిస్ట్రేట్ మెట్రోపాలిటిన్ కోర్టుషాకిచ్చింది. నాబ్ బెయిల‌బుల్ వారెంట్‌ను ఇష్యూ చేసింది.