దిగొచ్చిన టి. ఇంటర్ బోర్డ్.. విద్యార్థులకు గుడ్ న్యూస్
Send us your feedback to audioarticles@vaarta.com
గత వారం రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చిన్నపాటి గుడ్ న్యూస్ అందించింది. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 25 వరకూ బోర్డు గడువిచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తప్పనిసరిగా సప్లమెంటరీ ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది. అయితే బోర్డు ఇచ్చిన గడువుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు, నిరసనలకు దిగారు.
దీంతో దిగొచ్చిన ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్ష ఫీజుతో రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కొరకు దరఖాస్తు చేయుటకు గడవు తేదీని 25/04/2019 నుంచి 27/04/2019కు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అంటే రెండ్రోజులు గడువు పెంచారన్న మాట.
ఈ మేరకు మీడియా ఓ ప్రకటనలో పూర్తి వివరాలు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. కాగా.. ఎంతో మంది విద్యార్థులకు సున్నా మార్కులు రావడం, పరీక్షకు హాజరు కాలేదని.. ఇలా పలు విధాలుగా పరీక్ష రాసిన ఇంటర్మిడియట్ విద్యార్థుల జీవితాలతో బోర్డ్ ఆటాడుకుంది.!.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments