'సవ్యసాచి' ఫైనల్ షెడ్యూల్ డిటైల్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య, యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం `సవ్యసాచి`. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నిధి అగర్వాల్ కథానాయికగా పరిచమవుతోంది.
భూమికా చావ్లా, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక గీతంలో కనిపించనుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్‌లో ప్యాచ్ వర్క్, రీమిక్స్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. దీంతో సినిమా పూర్తవుతుంది. ఆగస్టు ద్వితియార్దంలో విడుదల కానున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments