హరిత హారం కు అండగా నిలిచిన సినీతారలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరిత హారం. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం అంటే...తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తించిన సినీప్రముఖులు హరితహారం కార్యక్రమంలో పాల్గొనం ద్వారా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి సమాజానికి తన వంతుగా ఏదోటి చేయాలని తపించే వ్యక్తి. అందుకనే ప్రస్తుతం మెగాస్టార్ 150వ చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మూగ జీవులు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ తమ వంతుగా సేవ చేస్తునే ఉన్నారు. ఇక ఈ హరితహారం కార్యక్రమంలో కూడా ముందుండి ఎంతో మందికి స్పూర్తి నిచ్చారు. రెండు రోజుల క్రితం అక్కినేని అఖిల్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం అఖిల్ మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి జంతువులు, పర్యావరణం కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ఎక్కువ. ప్రతి ఒక్కరుఒక మొక్కను నాటితే మనతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో మంచిది అంటూ స్పందించారు.
ఈరోజు అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ స్టాఫ్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. తన స్టాఫ్ తో కూడా మొక్కలు నాటించారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీసులతో కలిసి కూడా నాగార్జున మొక్కలను నాటి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చారు. నాగార్జున ఇచ్చిన పిలుపుతో అభిమానులు హరితహారం కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లిలో మొక్కలు నాటారు. కూకట్ పల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో అమల అక్కినేని పాల్గొని మొక్కలు నాటడంతో పాటు పలువురు మహిళలతో మొక్కలను నాటించారు.
అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్ని భార్య స్నేహ, బన్ని తనయుడు అయాన్ తదితరులు కూడా ఈరోజు ఉదయం తమ ఇంటి దగ్గర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ...మా అబ్బాయి అయాన్ తో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు తమ పిల్లలతో కూడా మొక్కలు నాటించాలి అన్నారు.
యువ హీరో దగ్గుబాటి రానా కూడా హరితహారం కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నానక్ రామ్ గూడలో రానా రెండు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. అలాగే మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, రెజీనా, సంపూర్ణేష్ బాబు, హేమ తదితరులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఇలా...ఈరోజు ఉదయం నుంచి హరితహారంకు సపోర్ట్ గా సినీ ప్రముఖులు మొక్కలు నాటి అందరిలో స్పూర్తినింపడం నిజంగా అభినందనీయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout