సుమంత్ నరుడా..! డోనరుడా..!కు ప్రముఖుల ప్రశంసలు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమకథ చిత్రంతో హీరోగా పరిచయమై...సత్యం, గౌరి, గోదావరి చిత్రాలతో సక్సెస్ సాధించిన అక్కినేని ఫ్యామిలీ హీరో నవ సమ్రాట్ సుమంత్. గోల్కండ హైస్కూల్, ఏమో గుర్రం ఎగరావచ్చు చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా..! ఈ చిత్రం ద్వారా పల్లవి సుభాష్ హీరోయిన్ గా, మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో విజయం సాధించిన విక్కీడోనర్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ లుక్ ను కింగ్ నాగార్జున ఇటీవల ట్విట్టర్ లో రిలీజ్ చేసారు.
ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరుడా డోనరుడా ఫస్ట్ లుక్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన నాగార్జున స్పందిస్తూ...నరుడా డోనరుడా ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సుమంత్ ఏం డోనేట్ చేస్తాడో..అంటూ స్పందించారు. అలాగే చైతన్య ట్విట్టర్ లో స్పందిస్తూ...ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ టు నరుడా డోనరుడా అని తెలియచేసాడు. ఇక అఖిల్ అయితే... సరదాగా...సూపర్ మేనా...? స్పె...మేనా..? అంటూ ఫస్ట్ లుక్ అదిరింది. టైటిల్ అదిరింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడా చూద్దామా అనిపిస్తుంది అన్నాడు.
దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అయితే...సూపర్ హిట్ ఫస్ట్ లుక్ ఇది. నరుడా డోనరుడా టీమ్ కి కంగ్రాట్స్ అంటూ అభినందనలు తెలియచేసారు. ఇక నాని అయితే...సూపర్ కూల్ ఫస్ట్ లుక్ ఇది అంటూ సుమంత్... ఇండస్ట్రీలో నీదే అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటూ సరదాగా ట్వీట్ చేసాడు. అలాగే దగ్గుబాటి రానా, శోభు యార్లగడ్డ, అడవి శేషు తదితరులు నరుడా డోనరుడా ఫస్ట్ లుక్ సూపర్బ్ అంటూ సుమంత్ కు అభినందనలు తెలియచేసారు. ఫస్ట్ లుక్ తో అందర్నీ ఆకట్టుకున్న సుమంత్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని ఆశిస్తూ...ఆల్ ది బెస్ట్ టు నరుడా డోనరుడా టీమ్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments