మహేశ్, చరణ్ కాంబినేషన్‌లో సినిమా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడిప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండ్ పెరుగుతోంది. తారక్, చరణ్ కలిసి మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీసారర్ ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని మల్టీస్టారర్ ట్రాక్‌లో ఉన్నాయి. ఈ కోవలో మరో మల్టీస్టారర్ రూపొందనుందని వార్తలు వినపడుతున్నాయి. మహేశ్, చరణ్ కాంబినేషన్‌లో అని సదరు వార్ల సమాచారం. కానీ అసలు ఇక్కడొక చిన్న మెళిక ఉంది. అదేంటంటే సూపర్ స్టార్ మహేశ్ ఈ మధ్య నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే అడివిశేష్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పుడు చరణ్ హీరోగా ఓ సినిమాను రూపొందించాలని మహేశ్ ప్లాన్ చేస్తున్నాడట.
మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనే ఆలోచన రాకమానదు. మహేశ్‌కు ఎంతో సన్నిహితమైన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని టాక్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై పలు రకాల వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చరణ్ సినిమా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి చివరకు ఈ సినిమా మెటీరియలైజ్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్నిరోజులు పడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments