ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓం ప్రకాశ్

  • IndiaGlitz, [Monday,April 19 2021]

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓం ప్రకాశ్ నారాయణకు కీలక పదవి లభించింది. ఫిల్మ్ జర్నలిస్ట్‌గా కొన్ని దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్‌గా ఓం ప్రకాశ్ నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. జర్నలిస్టుగా ఆయన తన జీవితాన్ని 1989లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలు ప్రముఖ పత్రికలు, ఛానెళ్లలో పని చేశారు.

సూపర్ హిట్, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, ఏబీయన్ ఛానెల్‌లో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా వివిధ హోదాలలో ఓం ప్రకాశ్ పని చేశారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆయన జాగృతి అనే వార పత్రికలో చిత్ర సమీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఎన్ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో అసోసియేటెడ్ ఎడిటర్‌గా ఓం ప్రకాశ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఎంపికవడంపై ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఉన్న అనుభవంతో ఈ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. తాను సి.బి.ఎఫ్.సి. అడ్వయిజరీ బోర్డు మెంబర్ కావడానికి కారకులైన సంస్కార భారతి దక్షిణ మధ్య క్షేత్ర మాజీ ప్రముఖ్ శ్రీ కుమారస్వామికి ఓంప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.

More News

ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.

ఫేషియల్‌కని వెళ్లిన నటిని అందవిహీనంగా మార్చేసిన డాక్టర్..

ఆడవాళ్లు అందానికి ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నటీమణులైతే.. చాలా ప్రాధాన్యం ఇస్తారు.

ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జనసేన-బీజేపీ

ఏపీలో కొనసాగుతున్న పొత్తును తెలంగాణలోనూ కొనసాగించేందుకు జనసేన-బీజేపీ సిద్ధమవుతున్నాయి.

షాకింగ్.. కళ్ల నుంచి కరోనా..!

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి ఇంతలా విస్తరించడానికి పలు కారణాలను శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ వస్తున్నారు.

నానితో సినిమా స్టార్ట్.. వెల్లడించిన హీరోయిన్ నజ్రీయా

ఇండస్ట్రీలో ఎవరైనా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తారంటే.. పక్కాగా వారిలో ముందు వరసలో నేచురల్‌ స్టార్‌ నాని పేరుంటుంది.