డిసెంబర్‌లో సినిమా ఫెస్టివల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశమ్రకు సంబంధించి 2019 డిసెంబర్ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ఏకంగా పది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఈ నెలలో సందడి చేయబోతున్నాయి. 2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` (మహేశ్ బాబు), `అల వైకుంఠపురములో` (అల్లు అర్జున్) వంటి భారీ బడ్జెట్ మూవీస్‌తో పాటు `ఎంత మంచివాడవురా` (కళ్యాణ్ రామ్), `శ్రీకారం` (శర్వానంద్) రిలీజ్ కాబోతున్నాయి. అలాగే తమిళ అనువాద చిత్రం `దర్బార్` (రజనీకాంత్) కూడా పండగ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే... మీడియం ప్రాజెక్ట్స్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ వరకు డిసెంబర్ హాట్ ఫేవరేట్‌గా మారింది.
సాధారణంగా డిసెంబర్ నెల అనగానే క్రిస్మస్ సీజన్‌లోనే సినిమాల సందడి కనిపిస్తుంటుంది. అయితే... ఈ సారి మాత్రం తొలివారం నుంచి పలు చిత్రాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. వెంకటేశ్, నాగచైతన్య మల్టీస్టారర్ `వెంకీమామ` డిసెంబర్ తొలి వారంలో విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. ఇక ఇదే నెలలో బాలకృష్ణ 105వ చిత్రం కూడా రిలీజ్ కాబోతోందని టాక్. అలాగే రవితేజ `డిస్కోరాజా`, నితిన్ `భీష్మ`, సాయితేజ్ `ప్రతి రోజూ పండగే` క్రిస్మస్ బరిలో ఉండగా... నాని `వి`, శర్వానంద్ `96` రీమేక్, విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్`, నాగశౌర్య `అశ్వథ్థామ`, నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబినేషన్ మూవీ కూడా డిసెంబర్‌లోనే విడుదల కానున్నాయని సమాచారం. అలాగే సల్మాన్ ఖాన్ హిందీ అనువాద చిత్రం `దబంగ్ 3` కూడా క్రిస్మస్ బరిలో ఉంది. మరి... వీటిలో ఏయే సినిమాలు ఫైనల్‌గా డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com