డిసెంబ‌ర్‌లో సినిమా ఫెస్టివ‌ల్‌

  • IndiaGlitz, [Sunday,October 06 2019]

తెలుగు చిత్ర ప‌రిశ‌మ్ర‌కు సంబంధించి 2019 డిసెంబ‌ర్ వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే.. ఏకంగా ప‌ది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఈ నెల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. 2020 సంక్రాంతికి 'స‌రిలేరు నీకెవ్వ‌రు' (మ‌హేశ్ బాబు), 'అల వైకుంఠ‌పుర‌ములో' (అల్లు అర్జున్‌) వంటి భారీ బ‌డ్జెట్ మూవీస్‌తో పాటు 'ఎంత మంచివాడ‌వురా' (క‌ళ్యాణ్ రామ్‌), 'శ్రీ‌కారం' (శ‌ర్వానంద్‌) రిలీజ్ కాబోతున్నాయి. అలాగే త‌మిళ అనువాద చిత్రం 'ద‌ర్బార్‌' (ర‌జ‌నీకాంత్) కూడా పండ‌గ స‌మ‌యంలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే... మీడియం ప్రాజెక్ట్స్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ వ‌ర‌కు డిసెంబ‌ర్ హాట్ ఫేవ‌రేట్‌గా మారింది.

సాధార‌ణంగా డిసెంబ‌ర్ నెల అన‌గానే క్రిస్మ‌స్ సీజ‌న్‌లోనే సినిమాల సంద‌డి క‌నిపిస్తుంటుంది. అయితే... ఈ సారి మాత్రం తొలివారం నుంచి ప‌లు చిత్రాలు విడుద‌ల‌కు క్యూ క‌డుతున్నాయి. వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీమామ‌' డిసెంబ‌ర్ తొలి వారంలో విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇక ఇదే నెల‌లో బాల‌కృష్ణ 105వ చిత్రం కూడా రిలీజ్ కాబోతోంద‌ని టాక్‌. అలాగే ర‌వితేజ 'డిస్కోరాజా', నితిన్ 'భీష్మ‌', సాయితేజ్ 'ప్ర‌తి రోజూ పండ‌గే' క్రిస్మ‌స్ బ‌రిలో ఉండ‌గా... నాని 'వి', శ‌ర్వానంద్ '96' రీమేక్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌', నాగ‌శౌర్య 'అశ్వ‌థ్థామ‌', నాగ‌చైత‌న్య - శేఖ‌ర్ కమ్ముల కాంబినేష‌న్ మూవీ కూడా డిసెంబ‌ర్‌లోనే విడుద‌ల కానున్నాయ‌ని స‌మాచారం. అలాగే స‌ల్మాన్ ఖాన్ హిందీ అనువాద చిత్రం 'ద‌బంగ్ 3' కూడా క్రిస్మ‌స్ బ‌రిలో ఉంది. మ‌రి... వీటిలో ఏయే సినిమాలు ఫైనల్‌గా డిసెంబ‌ర్‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయో చూడాలి.