మేం థియేటర్లు ఓపెన్ చేయం.. టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి థియేటర్ల పునః ప్రారంభానికి సిద్ధం అవుతున్న తరుణంలో టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. ఓటిటి వల్ల ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య అగ్గి రాజుకుంది. ఇప్పటికే తెలంగాణలో 100 శాతం సామర్థ్యంతో థియేటర్లకు అనుమతి ఇచ్చారు.
కానీ ఎగ్జిబిటర్లు మాత్రం థియేటర్లు ప్రారంభించేందుకు నిరాకరిస్తున్నారు. ఓటిటిలపై నిర్మాతలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో కీలకమైన మీటింగ్ బుధవారం జరిగింది. థియేటర్లు పునః ప్రారంభం అవుతున్న టైంలో అన్ని విషయాలు చర్చించుకోవాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: 'కప్పేలా' రీమేక్ లో ఖైదీ, మాస్టర్ విలన్ అర్జున్ దాస్.. సితార బ్యానర్ లో..
ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు నిర్మాతలకు షాక్ ఇచ్చారు. ఓటిటిలలో సినిమాల విడుదల ఆపే వరకు థియేటర్లని ఓపెన్ చేయం అని తేల్చి చెప్పేశారు. ఓటిటిల నుంచి సినిమా థియేటర్ వ్యవస్థని రక్షించాలని కోరారు.
కరోనా పాండమిక్ వల్ల థియేటర్లు మూత పడడంతో నిర్మాతలు తమ చిత్రాలని ఓటిటిలలో రిలీజ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నారు. దీనితో ఓటిటి హవా పెరిగిపోతోంది. థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే నిర్మాతలు తమ చిత్రాలని ఓటిటి లలో విడుదల చేయకుండా అక్టోబర్ వరకు వేచి చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అప్పటికీ థియేటర్లు ఓపెన్ కాకపోతే ఓటిటిలో రిలీజ్ చేసుకోవచ్చు అని సూచించారు.
ఇప్పటికే చాలా చిత్రాలు ఓటిటి రిలీజ్ కు రెడీ అయిపోయాయి. నిర్మాతల మండలి నిర్ణయాన్ని కాదని ఓటిటిలో రిలీజ్ చేస్తే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. దీనితో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ఉత్కంఠగా మారింది.
కొన్ని చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు ఓటిటి వైపు వెళుతున్నాయి. కానీ థియేటర్ రిలీజ్ నే నమ్ముకున్న భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల పునః ప్రారంభంపైనే ఆ చిత్రాల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout