Editor Gowtham Raju: ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత.. శోక సంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు మంగళవారం అర్ధరాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గౌతంరాజు కన్నుమూశారని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఆపరేటివ్ కెమెరామెన్‌గా ప్రస్థానం:
1954 జనవరి 15న ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు గౌతంరాజు. ఆయన తల్లిదండ్రులు రంగయ్య, కోదనాయకి. ఈ క్రమంలో గౌతంరాజు కుటుంబం మద్రాస్ కి షిఫ్ట్ కావడంతో.. అక్కడి అరుణాచలం థియేటర్లో ఆపరేటివ్ కెమెరామన్ గా కెరీర్ ప్రారంభంచారు. ఎడిటర్, డైరెక్టర్ సంజీవి దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. తమిళ చిత్రం ‘అవళ్ ఓరు పచ్చికొళందై’తో ఎడిటర్ గా మారారు. చిరంజీవి నటించిన చట్టానికి కళ్లు లేవు చిత్రానికి గాను తెలుగులో తొలిసారి పనిచేశారు. అనంతరం దర్శకుడు జంధ్యాలతో సాన్నిహిత్యం కారణంగా ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు గౌతంరాజే ఎడిటర్ గా పనిచేశారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 800 పైచిలుకు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి టాలీవుడ్ లో అగ్రశ్రేణి ఎడిటర్ గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆరు సార్లు నంది అవార్డులతో సత్కరించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళం, హిందీ చిత్రాలకు కూడా గౌతంరాజు పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout