సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పిన ఫిల్మ్ ఛాంబర్!
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లు కళకళలాడబోతున్నాయి. జూలై 30 నుంచి తెలంగాణాలో థియేటర్లు పునః ప్రారంభించేందుకు థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పార్కింగ్ ఫీజుల నేపథ్యంలో వెసులుబాట్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2018లో పార్కింగ్ ఫీజులు రద్దు చేస్తూ జీవో 63 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ జీవోని ప్రభుత్వం సవరిస్తూ ఉత్తర్వలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదేశాల ద్వారా సింగిల్ స్క్రీన్ థియేటర్లు పార్కింగ్ ఫీజు వసూలు చేసే వెసులుబాటు కల్పించింది.
ఇది కేవలం సింగిల్ స్క్రీన్ లకు మాత్రమే. మల్టిఫ్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదు. దీనితో సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పార్కింగ్ ఫీజు వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని ఇటీవల ఎగ్జిబిటర్లు సీఎం కేసీఆర్ కు అభ్యర్థించారు.
తమ అభ్యర్థనని అంగీకరించిన కేసీఆర్, కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని లకు ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే కరోనా వల్ల థియేటర్ల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో జూలై 30 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout