ఫిలించాంబర్ సెక్రటరీకి బెదిరింపులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చలన చిత్ర నిర్మాతల వాణిజ్య మండలి సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై దామోదర్ ప్రసాద్ బంజారా హిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు.
జూన్ 9న దామోదర్ ప్రసాద్‌కు నిఖిల్ రాస్తోని అనే వ్యక్తి ఫోన్ చేసి తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మీకు సన్నిహితుడని తెలిసిందని, మాకు ప్రతాని ఇవ్వాల్సిన డబ్బులు మీరే ఇప్పించాలని, లేందటే అంతు చూస్తామని బెదరించారట. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనకు కూడా నిఖిల్ రాస్తోని అనే వ్యక్తి నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తను అలాంటి పేరు గల వ్యక్తికి ఏ అప్పు లేనని తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments