ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల డైరీ (డైరెక్టరీ) ఆవిష్కరణ!
- IndiaGlitz, [Monday,April 24 2017]
వి.బి ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విష్ణు బొ ప్పన ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల కొత్త డైరీ (2017-18 డైరక్టరీ)ని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీరాజా, ఈసీ మెంబర్ సురేష్ కొండేటి, మా జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, నిర్మాత గురు రాజ్, టీవి. ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ వినోద్ బాల, అశోక్ కుమార్, రామ్ జగన్, పద్మజరాణీ, పద్మిని, శ్రీనివాసరావు, హిమబిందు, శ్రీనివాసరావు, విజయ్ యాదవ్ తో పాటు పలువురు బుల్లి తెర ఆర్టిస్టులు, స్పాన్సర్లు పాల్గొన్నారు.
అనంతరం విష్ణు మాట్లాడుతూ, ' వి.బి ఎంటర్ టైన్ మెంట్స్ అనేది ఒక మార్కెంటింగ్ సంస్థ. నేను సాప్ట్ వేర్ ఇంజనీర్ ని. కానీ సినిమాలపై ఫ్యాషన్ తో ఇటు వైపు వచ్చా. పలు సీరియళ్లలో కూడా నటించా. ఈ క్రమంలోనే నా స్నేహితులు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడం మొదలు పెట్టా. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ బాగా రన్ అవుతుంది. 2015తో బుల్లి తెర అవార్డులు ప్రారంభించాను. 2016లో అన్నపూర్ణ స్టూడియోస్ సెవెన్ ఏకర్స్ లో అవార్డులు అందించాం. 2017 అవార్డులను డిసెంబర్ 3వ తేదిన ప్రదానం చేస్తాం. స్పాన్సర్స్ ఉండటం వలనే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయగలుగుతున్నాను. వాళ్లు లేకపోతే ఈ డైరీ ఉండేది కాదు. వాళ్ల సహకారం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా. డైరీలో సినిమా-టీవీ ఆర్టిస్టుల పూర్తి వివరాలను పొందుపరిచాం. అలాగే కొత్త వాళ్లకు డైరీ లో అవకాశం కల్పించాం. ఏ దర్శక, నిర్మాతకైనా ఈ డైరీ ఉపయుక్తంగా ఉంటుంది' అని అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ, స్పాన్సర్స్ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయలేం. కొత్త ఆర్టిస్టలను కూడా ప్రోత్సహిస్తూ డైరీ ప్రచురించడం ఆనందంగా ఉంది. ఈ సంస్థలో సీనియళ్లు నిర్మిస్తే 'మా' లో ఉన్న ఆర్టిస్టులను కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
వినోద్ బాల మాట్లాడుతూ, - డైరీ అనేది నా దృష్టిలో ఒక కమ్యునికేషన్. ఆ కమ్యునికేషన్ సరిగ్గా లేకపోతే అవకాశాలు రావు. ఈ డైరీలో అందరి పేర్లు..ఫోన్ నంబర్లతో క్లియర్ గా ఉన్నాయి. డైరీలో ఉన్న ఒక వ్యక్తికి అవకాశం వచ్చినా డైరీ సార్ధకత చేకూరినట్లే. విష్ణు బొప్పన గారు సొంతగా డైరీని తీసుకురావడం గొప్ప విషయం. అదీ టీవీ డైరీని తీసుకురావాలంటే ఎన్ని ఇబ్బందులుంటాయో తెలుసు' అని అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'ఈ డైరిని అందరికంటే ముందు నేనే చూశాను. చాలా బాగుంది. ఇందులో ఆర్టిస్టులందరి పేర్లతో సహా పక్కన ఫోటో, ఫోన్ నబంబర్లతో చక్కగా వేశారు. దీనివల్ల ఎలాంటి కన్ ప్యూజన్స్ ఉండవు. దీన్ని వెబ్ సైట్ క్రియేట్ చేసి ఆన్ లైన్ లో కూడా చేస్తే బాగుంటుంది. విష్ణు ఈ డైరీ తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అతని కష్టం వృద్ధా కాదు' అని అన్నారు.