పసుపులేటి రామారావు మృతి పట్ల ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం

  • IndiaGlitz, [Tuesday,February 11 2020]

పసుపులేటి రామారావు మృతి పట్ల ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. 45 సంవత్సరాల నుండి సినిమా పాత్రికేయుడుగా అనుభువం ఉన్న రామారావు గారు మా అసోసియేషన్ గౌరవ సభ్యులుగా కొనసాగుతూ మాకు ఎప్పటి కప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్ములను ముందుండి నడిపిస్తున్న పసుపులేటి రామారావు ఇలా అకాల మరణం చెందటం తమకు తీవ్ర ద్రిగ్భ్రాంతిని కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ రోజు సాయంత్రం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసారు.