కరోనాపై యుద్ధం.. పవన్ కల్యాణ్ భారీ విరాళం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు సెల్ఫ్ క్వారంటైన్‌ అనగా స్వీయ నిర్భందం విధించికుని ఇంట్లో నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. ఇలా దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. చైనాలో రోజురోజుకు పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. ఇటలీలో మాత్రం శవాల దిబ్బగా మారుతోంది.

తెలుగు రాష్ట్రాలకు..

ఈ క్రమంలో కరోనా యుద్ధం చేయడానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం ప్రకటింగా.. తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఏపీకి 50 లక్షల రూపాయిలు.. తెలంగాణకు 50 లక్షల రూపాయిలు.. అంటే రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు విరాళంగా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నట్లు ట్వి్ట్టర్ ద్వారా పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ప్రధానికి కూడా..

ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుతుందని.. అందుకు గాను తాను పీఎం రిలీఫ్ పండ్‌కు కోటి రూపాయిలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మొత్తంలో ఇచ్చిన హీరో పవన్ కల్యాణ్ ఒక్కరే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా పవన్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున చెప్పుకుంటూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

More News

లారెన్స్ హీరోగా కొత్త చిత్రం

రాఘ‌వ లారెన్స్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమంటే.. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’ త‌మిళ రీమేక్‌గా రూపొంద‌నున్న చిత్ర‌మిది.

కరోనా నేపథ్యంలో ఇటలీలో తెలుగు గాయనికి నరకం!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తొలి ట్వీట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది సంద‌ర్భంగా తాను సోషల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుతున్నాన‌ని ఆయ‌న తెలియ‌జేసిన సంగ‌తి

'ఆర్ ఆర్ ఆర్' అంచ‌నాల‌ను పెంచేస్తున్న మోష‌న్ పోస్ట‌ర్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ప్రజా ప్రతినిధులకు వార్నింగ్.. రైతన్నకు అభయం!

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదని.. రేపట్నుంచి రంగంలోకి దిగి క్రియాశీలకంగా పనిచేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రైతన్నలకు కేసీఆర్ శుభవార్త చెప్పారు.