ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
మూడు దశాబ్దాలుగా ఎందరో స్టార్ హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్ నిర్మాత. తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, విజయన్ మాస్టర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా...
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ - ''ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీ నాకెంతో అండగా నిలబడింది. నేను ఇండస్ట్రీకి చాలా రుణపడిపోయాను. ఆ రుణం తీర్చుకోవడానికి నేను మా అబ్బాయి రాహుల్ విజయ్‌ను హీరోగా, దివ్య విజయ్‌ను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. దర్శకుడు రాము చెప్పిన కథ బాగా నచ్చింది. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయి, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ - ''నేను సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. నేను చెప్పిన కథ నచ్చడంతో విజయ్‌గారు నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చారు. అలాగే మణిశర్మగారు, చోటా కె.నాయుడు, నవీన్ నూలి సహా టాప్ టెక్నిషియన్స్‌కు ఇచ్చారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి, రాహుల్ విజయ్, దివ్యగారికి థాంక్స్. రాహుల్‌గారితో ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నాను. రాహుల్‌కి సరిపోయే కథ. స్క్రిప్ట్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఈ నెల 21న షూటింగ్ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో జరిగే షెడ్యూల్స్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు.
నిర్మాత దివ్య విజయ్ మాట్లాడుతూ - ''ఈ సినిమాతో రాహుల్ విజయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. మేఘానంద్, సత్యానంద్‌గారి వద్ద రాహుల్ ట్రయినింగ్ తీసుకున్నాడు. హీరోయిన్ ఫైనలైజ్ కావాలి. సీనియర్ టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ అందరూ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఈ నెల 21నుండి షూటింగ్ ప్రారంభంకానుంది'' అన్నారు.
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ - ''రాముగారు మంచి కథ చెప్పారు. సినిమా లవ్, అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. లవ్ మెయిన్ ఎలిమెంట్‌గా మిగిలిన ఎలిమెంట్స్‌గా అన్ని దానికి లింక్ అయ్యి ఉంటాయి'' అన్నారు.
రాహుల్ విజయ్, రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, పవిత్ర లోకేష్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, వెన్నెల కిషోర్, ఈశ్వరీరావు, గొల్లపూడి మారుతీరావు, సత్యం రాజేష్, జోష్ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: నవీన్ నూలి, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, పి.ఆర్.ఒ: వంశీ కాకా, లైన్ ప్రొడ్యూసర్: రాజు ఓలేటి, నిర్మాత: దివ్య విజయ్, రచన, దర్శకత్వం: రాము కొప్పుల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com