'జైలవకుశ'తో వరుసగా ఐదోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జైలవకుశ చిత్రం గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో జై పాత్రలో తారక్ అభినయం అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రతినాయకుడి ఛాయలుండే ఈ పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో.. ఈ క్లబ్‌లోకి ఎన్టీఆర్ నటించిన నాలుగు వరుస చిత్రాలు చేరినట్లయ్యింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ చిత్రాలతో తారక్ ఈ ఫీట్‌ని సొంతం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఫీట్‌ను ఎన్టీఆర్ ఐదోసారి సాధించాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన బాద్షా మిలియన్ డాలర్స్ మూవీగా ఓవర్సీస్లో నిలిచింది.
రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com