'ఫిదా' సెన్సార్ పూర్తి..

  • IndiaGlitz, [Friday,July 14 2017]

'ముకుంద‌, కంచె వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో మెప్పించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న చిత్రం 'ఫిదా'. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని జూలై 21న విడుద‌ల‌వుతుంది.
ఈ సంద‌ర్భంగా ...
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న మ‌రో క్యూట్ ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఫిదా'. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్ ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు సింగిల్ ఆడియో, వీడియో కట్ కూడా ఇవ్వ‌లేదు. మా బ్యాన‌ర్ నుండి మ‌రో మంచి సినిమా వ‌స్తుంద‌ని అభినందించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను జూలై 21న విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌తి ఒక‌రు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసే సినిమా ఇది అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను'' అన్నారు.

More News

ఆగస్టు 4న బయపెట్టించే ఇదేం దెయ్యం

శ్రీనాద్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ అర్పి , రచన స్మిత్ , రుచి ప్రధాన పాత్రలో .. ఎ వి రమణ మూర్తి సమర్పణలో వి రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ఫిలిమ్స్ పతాకం పై ఎస్. సరిత నిర్మిస్తున్న చిత్రం ''ఇదేం దెయ్యం''.

చాటుగా నవ్వుకుంటున్నారు..

మదరాసపట్టణం అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎమీ జాక్సన్ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది.

చేతల మనిషినని అంటున్న హీరోయిన్

మహేష్భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అలియా భట్. తక్కువ టైమ్లోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. ఈ సంవత్సరం మూడు సినిమాలు చేస్తూ యమా బిజీగా వుంది.

చరణ్ సినిమా బిజినెస్ క్రేజ్

రామ్ చరణ్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'రంగస్థలం 1985'

ఆరు దేశాల్లో మహేష్ మూవీ..

ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాహుబలి2' చిత్రంలో గ్రాఫిక్స్ ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయో తెలిసిందే. భారీ సినిమాలకు మంచి కథ, కథనాలు, మంచి ఆర్టిస్టులు ఎంత అవసరమో గ్రాఫిక్స్ కూడా అంతే అవసరం అన్నట్టుగా మారాయి