డైరెక్టర్ని ఆకాశానికేత్తెస్తున్న ‘ఫిదా’ బ్యూటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో వరుణ్ తేజ్ ‘ఫిదా’తో ప్రేక్షకులను ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి .. ఇప్పుడు రానాతో ‘విరాటపర్వం’లో నటిస్తోంది. మరో వైపు నాగచైతన్యతో ఈమె జోడీ కట్టిన ‘లవ్ స్టోరి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు శేఖర్ కమ్ములను పొగడ్తలతో ముంచేసింది. తాను ఇప్పుడు జీవితాలను చూసే విధానం మారడానికి శేఖర్ కమ్ములగారే కారణం. నాకు జీవితంలో ఎలా పోరాడాలో నేర్పారు. జీవితంలో ఎలాంటి క్లిష్టపరిస్థితునైనా ఎదుర్కొనేంతగా ధైర్యాన్ని ఇచ్చారని అంది సాయిపల్లవి. రీసెంట్గా ‘పావకథైగల్’ అనే అంథాలజీలో నటించిన సాయిపల్లవి ఇప్పుడు త్వరలోనే ‘లవ్‌స్టోరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా పవన్‌కల్యాణ్, రానా కాంబినేషన్లో రూపొందుతోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తుందని అంటున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందబోయే వేదాళం సినిమా రీమేక్‌లోనూ చిరంజీవి చెల్లెలు పాత్రలో సాయిపల్లవి నటిస్తుందని వార్తలు మెండుగా వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com