'ఫిదా'కు ఇంత భారీ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదాస. ఎన్నో విజయవంతమై చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు శేఖర్ కమ్ముల. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌లు సినిమాను నిర్మించారు. జూలై 21న సినిమా విడుదలైంది. త్వరలోనే 50 రోజులను పూర్తి చేసుకోనున్న ఈ సినిమా అర్ధ శతదినోత్సవ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లోని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో....
ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం హ్యాపీ
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా దర్శకుడు శేఖర్ హాలీడేకు వెళుతున్నారు. అలాగే మా హీరో వరుణ్‌తేజ్ నెక్స్‌ట్ మూవీ కోసం లండన్ వెళుతున్నాడు. అందుకనే మరో నాలుగు రోజుల తర్వాత 50 రోజులు పూర్తి చేసుకుంటున్న ఫిదా సినిమా వేడుకను ఈరోజే నిర్వహిస్తున్నాం. 20 సంవత్సరాలు డిస్ట్రిబ్యూటర్‌గా, 14 ఏళ్ల నిర్మాతగా సాగిస్తున్న కెరీర్‌లో 7 వారంలో కూడా థియేటర్స్ హౌస్‌ఫుల్ కావడం అనేది ఈ మధ్య బాహుబలి తర్వాత మా సినిమాకే జరిగింది. చిన్న సినిమాగా విడుదలైన ఫిదాకు ఇలాంటి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
ఈ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తాను
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ''గట్టిగా అనుకుంటే జరుగుతుందని చాలా మంది అంటుంటారు. అలా మేము కూడా ఫిదా గురించి గట్టిగాఅనుకుని ఉంటాం. అందుకే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హ్యాపీడేస్ తర్వాత ఆ రేంజ్ రెస్పాన్స్ రావడం చాలా సంతోషం. ఈ మ్యాజిక్ మళ్లీ మళ్లీ క్రియేట్ చేయడానికి మా వంతుగా బెస్ట్‌గా ప్రయత్నిస్తాం. ఫిదా జర్నీ మ్యాజికల్. నాకు సపోర్ట్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్'' అన్నారు.
ఇంత ప్రేమను ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్
సాయిపల్లవి మాట్లాడుతూ - ''ఈ వేడుక చూస్తుంటే యూనిట్ అంతా రీ యూనియన్‌లా కనిపిస్తుంది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన దిల్‌రాజు, శేఖర్ కమ్ములగారికి థాంక్స్. అందరూ ఎక్కడ చూసినా భానుమతి అనే పిలుస్తున్నారు. ఇంత పెద్ద ప్రేమను ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
సూపర్బ్ రెస్పాన్స్
హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ''ఈ ఫంక్షన్ గురించి దిల్‌రాజుగారు రెండు మూడు వారాల క్రితమే చెప్పారు. ఐదారేళ్లుగా 50, 100 రోజుల ఫంక్షన్‌ను ఎవరు జరుపుకోవడం లేదు. ఈ మధ్యన సినిమా అనేది మూడు వారాలు అడుతుంది. మూడు వారాల్లోనే డబ్బులు వచ్చేయడంతో సినిమాను తీసేస్తుంటారు. ఈ విషయంలో ఫిదా మినహాయింపు సంపాదించుకుంది. అందరి నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంత మంచి సినిమాను మాతో చేసినందుకు శేఖర్‌గారికి థాంక్స్. ఈ సినిమా సక్సెస్ టీమ్ ఎఫర్ట్. రాజుగారికి ఈ సినిమా మూడో 50 రోజుల సినిమా వేడుక. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
యూనిట్‌కు 50 రోజుల షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శిరీష్, జీవన్ బాబు, గీతా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com