ఫీల్ గుడ్ హ్యాట్రిక్ వచ్చేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏకకాలంలో ఓ నిర్మాత మూడు చిత్రాలను నిర్మించడమే ఒక విశేషమైతే.. ఆ మూడు కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లుగా రూపొందడం మరో విశేషం. ఇవన్నీ కూడా అటుఇటుగా నెల లేదా రెండు నెలల గ్యాప్లో ప్రేక్షకుల ముందుకు రానుండడం మరింత విశేషం. ఇంతకీ ఆ నిర్మాత ఎవరంటే చినబాబుగా పిలవబడే ఎస్.రాధాకృష్ణ. ఆ మూడు చిత్రాలు ఏమో 'అఆ', 'బాబు బంగారం', 'ప్రేమమ్'.
నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అఆ'ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబునే స్వయంగా నిర్మిస్తుంటే.. వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాబు బంగారం' ఆయన సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోంది. అలాగే నాగచైతన్య, శ్రుతి హాసన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న 'ప్రేమమ్' కూడా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోంది.
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లుగా రూపొందుతున్న ఈ మూడు సినిమాలు జూన్, జులై మాసాల్లో ప్రేక్షకులకి ముందుకు రానున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో 'క్షణం', 'ఊపిరి', 'బ్రహ్మోత్సవం'తో పివిపి సంస్థ ఎలాగైతే తక్కువ కాలంలో మూడు చిత్రాలను అందించిందో.. అలాగే చినబాబు కూడా మూడు చిత్రాలతో తక్కువ కాలంలో సందడి చేయనుండడం వార్తల్లో నిలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com