Sharmila:సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

  • IndiaGlitz, [Saturday,May 04 2024]

సీఎం జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుతో ఈ వైఎస్సార్ బిడ్డ చేతులు కలిపినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.

జగన్ మానసిక స్థితి గురించి నాకు భయం వేస్తోంది. చంద్రబాబు చెబితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని అంటున్నారు. మరి ఆనాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారు. చంద్రబాబు ఎంతో పవర్ ఫుల్ అని చెబుతున్నారు... ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటున్నారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుంది. అందుకే అద్దం పంపిస్తున్నాను. ఈ అద్దంలో చూసుకుంటే జగన్‌కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా?ఈ అద్దంలో జగన్ తనను తాను చూసుకోవాలి. అద్దంలో తానే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలి అన్నారు.

అలాగే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు దాని వెనక రిలయన్స్ సంస్థ వారి హస్తం ఉందని జగన్ చెప్పారు. అది నిజమని నమ్మిన ఎంతో మంది వైఎస్సార్ అభిమానులు రిలయన్స్ సంస్థలపై దాడులు చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పటికీ వారు ఆ కేసులతో ఇబ్బంది పడుతున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఏ రిలయన్స్ సంస్థ అయితే వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదం వెనక ఉందని చెప్పారో.. అదే రిలయన్స్ సంస్థకి చెందిన వ్యక్తికి రాజ్యసభ పదవి ఇచ్చారు. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధం అని తనంతట తానే రుజువు చేసుకున్నారు అని విమర్శించారు.

ఇక సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్సార్ పేరు ప్రస్తావన గురించి చెబుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జిషీటులో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్ పట్టుబట్టి చేర్చారు. అయితే ఇప్పుడు నేను మాటలు మార్చినట్టుగా పొన్నవోలు నా పాత వీడియోలను వెతికి మరీ చూపిస్తున్నారు. నన్ను ఊసరవెల్లిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు నిజం తెలియక మేము అలా మాట్లాడాం. ఈ రోజు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మొన్న సోనియా గాంధీ గారిని కలిస్తే ఆ విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారు. నేను పెట్టలేదని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే చెప్పారు. పొన్నవోలు సుధాకర్ మూడు కోర్టులకు తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చేర్చించారని ఆయన చెప్పేదాకా నాకు తెలియదు’’ అని షర్మిల వెల్లడించారు.

More News

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంలో దాడులు, దోపిడీలే: పవన్ కల్యాణ్

రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని.. మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ధీమా వ్యక్తంచేశారు.

CM Jagan:చంద్రబాబు మాటలు నమ్మకండి.. బాలయ్య అడ్డాలో సీఎం జగన్ పిలుపు..

ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చట్టంతో ప్రజల భూములు లొక్కొంటారని..

Sharmila: మీ 'నవరత్నాలు'కు మా 'నవసందేహాలు' ఇవే.. సీఎం జగన్‌కు షర్మిల ప్రశ్నలు

ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు అన్ని పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

BRS Party:బీఆర్ఎస్ పార్టీలో విలువ లేదు.. మాజీ ఎంపీ రాజీనామా

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కీలక నేతలు అధికార కాంగ్రెస్.

Raja Singh:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు.. రాజాసింగ్ ఆగ్రహం..

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. నేతల విమర్శలు, ప్రతివిమర్శలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లుతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో కీలక నేతలు