మ‌హేశ్ తండ్రి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తున్నారంటే..?

  • IndiaGlitz, [Monday,March 22 2021]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సర్కారువారిపాట‌’. మ‌హేశ్ 27వ చిత్ర‌మిది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని యూనిట్ ప్ర‌క‌టించేసింది. రేప‌టి నుంచి దుబాయ్‌లో ఈ సినిమాకు సంబంధించిన కొత్త‌ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 15 వ‌ర‌కు ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఉంటుంది. ఇప్ప‌టికే దుబాయ్ ఫైట్‌, సాంగ్ స‌హా కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను యూనిట్ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ పూర్త‌యితే ఇక ఇండియాలో చిత్రీక‌రించాల్సిన షెడ్యూల్ మాత్ర‌మే మిగిలి ఉంటుంది.

ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. మ‌రి ఈ పాత్ర‌లో ఎవ‌రిని తీసుకోవాల‌ని యూనిట్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డింది. చివ‌ర‌కు మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టుడు జ‌య‌రామ్‌ను హీరో తండ్రి పాత్ర‌కు ఎంపిక చేసుకున్నార‌ట‌. హీరో తండ్రిని మోసం చేసి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టి విదేశాల‌కు పారిపోయిన విల‌న్‌ను ఇండియాకు రప్పించే హీరో క‌థే ఇది అని టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

More News

అతిథి పాత్ర‌లో ఎ.ఆర్‌.రెహ్మాన్‌

ఆస్కార్ విజేత ఎ.ఆర్‌.రెహ్మాన్ సంగీతం గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ద‌క్షిణాది, ఉత్త‌రాది సినిమాలే కాదు..

బన్నీకి విలన్‌గా మలయాళీ స్టార్ హీరో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’.

ఎన్టీఆర్‌ ప్రసంగిస్తుండగా.. ‘సీఎం సీఎం’ అంటూ అభిమానుల నినాదాలు..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్నకుమారుడు శ్రీసింహా కోడూరి ‘మత్తు వదలరా’ తరువాత హీరోగా నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'.

జీవితంలోని ఏడు రంగులనూ ‘రంగ్‌ దే’ చూపిస్తుంది: త్రివిక్రమ్

'రంగ్ దే' ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా ఈ చిత్రం రూపొందింది.

ఈ కుటుంబానికి నేనెప్పుడూ గెస్ట్‌ను కాను: ఎన్టీఆర్

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో  మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ సింహా కోడూరి తాజాగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’.