MS Swaminathan : భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

  • IndiaGlitz, [Thursday,September 28 2023]

భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గురువారం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. స్వామినాథన్ వయసు 98 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ఇది స్వామినాథన్ ప్రస్థానం :

1925 ఆగస్ట్ 7న నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు స్వామినాథన్. తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్ కావడంతో ఆయన బాటలోనే మెట్రిక్యులేషన్ పూర్తయిన వెంటనే మెడికల్ స్కూల్‌లో చేరారు స్వామినాథన్. ఈ దశలో 1943 ప్రాంతంలో బెంగాల్ ప్రాంతంలో చోటు చేసుకున్న తీవ్రమైన కరువు స్వామినాథన్‌ను తీవ్రంగా కలచివేసింది. దేశ ప్రజలు ఆకలి బాధను అనుభవించకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. తిరువనంతపురంలోని మహారాజా కాలేజీలో జువాలజీలో డిగ్రీ చేసి ఆయన.. అనంతరం మద్రాస్ అగ్రికల్చరల్ కాలేజీల్ చేరారు. అక్కడ అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలోని ప్రఖ్యాత భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ)లో పీజీ అభ్యసించారు.

విద్యాభ్యాసం తర్వాత సివిల్స్ పరీక్షలు రాసిన స్వామినాథన్ ఐపీఎస్‌కు అర్హత సాధించారు. అయినప్పటికీ ఆ అత్యున్నత హోదాను వదులుకుని యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆలూగడ్డ జన్యుపరిణామంపై పరిశోధనలు చేశారు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో చేరి పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొద్దికాలం అక్కడ పనిచేసిన స్వామినాథన్ 1954లో తిరిగి భారతదేశానికి వచ్చారు. అనంతరం తాను చదువుకున్న ఐఏఆర్ఐలోనే శాస్త్రవేత్తగా చేరారు.

1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1987లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. భారతదేశంలో ఆహోరోత్పత్తి పెరిగేందుకు తన జీవితాంతం ఎంతో కృషి చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం సత్కరించింది. అలాగే వ్యవసాయ రంగంలో నోబెల్‌గా చెప్పుకునే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ స్వామినాథన్‌ను వరించింది. దీనితో పాటు రామన్ మెగసెస్సే, అల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతిని స్వామినాథన్ అందుకున్నారు.

More News

Buggana Rajendranath Reddy:ఉద్యోగుల సంక్షేమానికి జగన్‌ ‘‘గ్యారెంటీ’’.. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఉద్యోగుల పక్షపాతినని నిరూపించుకున్నారు.

Balapur Laddu 2023 Price : అత్యధిక ధరకు బాలాపూర్ గణపతి లడ్డూ .. ఈసారి రికార్డు బద్ధలు

11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు.

Bigg Boss 7 Telugu : శుభశ్రీ మీద మీదకు వెళ్లిన శివాజీ.. బిడ్డ అంటూ ఏంటిది, నాలుగో పవర్ అస్త్రకు పోటీ మొదలు

బిగ్‌బాస్ 7 తెలుగులో నామినేషన్స్ హడావుడి ముగిసింది. వాదనలు, కొట్లాటలు, గొడవల అనంతరం ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో వున్నారు.

Pawan Kalyan:పవన్ కల్యాణ్ సీఎం కావాలి .. జనసేనకు స్టంట్ మ్యాన్ విరాళం, ఆ సినిమా పారితోషికం మొత్తం పార్టీకి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు స్టంట్ మ్యాన్ శ్రీబద్రి. చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో

Pawan Kalyan:ఆడబిడ్డలపై అఘాయిత్యాలు .. జగన్ , హోంమంత్రికి స్పందించే బాధ్యత లేదా : పవన్ కళ్యాణ్

చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్ధిని దారుణంగా హతమార్చిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.