నాన్నగారు ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నారు: ఎస్పీ చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య విషయమై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ గుడ్ న్యూస్ చెప్పీరు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షలో బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందని చరణ్ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో ఎస్పీ బాలుకి నెగిటివ్ అని నిర్ధారణ అయిందని కానీ.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఇంకా వెంటిలేటర్ తొలగించలేదని వెల్లడించారు.
‘‘కరోనా పరీక్షల్లో నాన్నగారికి నెగిటివ్ అని వచ్చింది. అయితే నాన్నగారు పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండడంతో ఇంకా వెంటిలేటర్ తొలగించలేదు. నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా మెరుగవడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నాన్నగారు ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ మ్యాచ్‌లు చూస్తున్నారు. ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. రాసుకోవడం, మాట్లాడడం చేస్తున్నారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతోంది. అమ్మానాన్నల పెళ్లి రోజు సందర్భంగా వారాంతంలో చిన్న సెలబ్రేషన్ చేశాం. ఇన్ని రోజులూ నాన్నగారి క్షేమం కోసం ప్రార్థనలు చేసిన మీ అందరికీ ధన్యావాదాలు’’ అని చరణ్ పేర్కొన్నారు.
కాగా.. ఆగస్ట్ 5న కరోనా కారణంగా చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఆసుపత్రిలో జాయిన్ ఆయనట్టు ఆయన ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. అయితే ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే ఎస్పీబీ పరిస్థితి విషమించింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. తాజాగా బాలుకి నెగిటివ్ రావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments