తండ్రీకొడుకులు.. భిన్న ఫలితాలు
Send us your feedback to audioarticles@vaarta.com
'మణిశర్మ' ఈ పేరు వింటే చెవుల్లో మెలోడీలు నాట్యమాడుతాయి. ఒకప్పుడు వరుసబెట్టి ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ మెలోడీ బ్రహ్మకి గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. గత సంవత్సరం ఏకంగా 8 సినిమాలకు సంగీతాన్ని అందించినా.. వాటిలో ఒక్కటి కూడా సాలిడ్ హిట్ కాలేదు.
ఈ నేపథ్యంలో.. 2018లో 'టచ్ చేసి చూడు' సినిమాతో తొలిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించి తనదైన ముద్ర వేశారు మణిశర్మ. అయితే ఈ చిత్రం కూడా మణిశర్మ స్థాయికి తగ్గ విజయాన్ని అందివ్వలేకపోయింది. అయితే, అదే రోజు విడుదలైన 'ఛలో' మూవీ మంచి హిట్ అయ్యింది. విశేషమేమిటంటే.. ఈ సినిమాకి స్వరాలు అందించింది స్వయానా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కావడం. తండ్రి బాటలోనే నడుస్తున్న ఈ తనయుడు.. ఛలో కోసం మంచి మెలోడీలను అందించాడు.
ముఖ్యంగా చూసీ చూడంగానే పాట అయితే సినిమా విడుదలకు ముందే పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు..సినిమా కూడా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. మొత్తమ్మీద ఒకే రోజు తండ్రీకొడుకుల సినిమాలు విడుదల కాగా.. వాటిలో తండ్రి సినిమా పరాజయాన్ని చవిచూడగా.. తనయుడి సినిమా విజయాన్ని అందుకుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments