ఫ్యాషన్ డిజైనర్ యుఎస్ హక్కులు వారికే
Saturday, April 22, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ చిత్రం యుఎస్ హక్కులను కె.ఎస్.ఎంటర్టైన్మెంట్ చేజిక్కించుకుంది. కె.ఎస్. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సింగనమల కల్యాణ్ ఈ చిత్రం హక్కులను తీసుకున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వంశీ దర్శకుడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన లేడీస్ టైలర్ అప్పట్లో ఎంతటి ప్రాచుర్యాన్ని పొందిందో తెలిసిందే. ఇప్పుడు ఆ లేడీస్ టైలర్ కొడుకు పెద్దయి ఫ్యాషన్ డిజైనర్ అయితే ఎలా ఉంటుందోననే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. యుఎస్‌లో భారీగా విడుదల చేయనున్నట్టు సింగనమల కల్యాణ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments