'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
వంశీ వంటి లెజెండ్రీ డైరెక్టర్‌తో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన నేటి తరం వారికి పోటీగా ఉన్నారు. ఆయనతో పోటీ పడుతూ పనిచేయడానికి అందరూ చాలా కష్టపడాల్సి వచ్చింది. తెరపై నటీనటులతో పాటు తెర వెనుక కూడా చాలా మంది టెక్నిషియన్స్ పనిచేశారు. అందరికీ థాంక్స్ అని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు.
సుమంత్ అశ్విన్, అనీషా అంబ్రోస్, మానస, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా సీనియర్ వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'. సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ ..ప్యాషన్ డిజైనర్ చిత్రాన్ని ఓ పొయెటిక్‌గా మణిశర్మగారు అద్భుతమైన సంగీతానికి నగేష్ బానెల్లా దృశ్యకావ్యంలా చూపించారు. సుమంత్ అశ్విన్ డేడికేషన్‌తో వర్క్ చేశాడు. ఈ సినిమా కోసం వంశీగారు ఎన్ని నిద్ర లేని రాత్రులను గడిపారో నాకు తెలుసు. గోదావరి ఇంకా ఎంత అందంగా చూపించాలో అని ఆయన పడ్డ తాపత్రయం తెరపై కనపడిందని అన్నారు. ప్రేక్షకులు ఆదరిస్తారని చేసిన ప్రయత్నాన్ని సక్సెస్ చేసినందుకు థాంక్స్ చెప్పారు దర్శకుడు సీనియర్ వంశీ.
సాధారణంగా నేను చేసిన సినిమాలు విడుదలైతే నాకు చాలా మంది ఫోన్ చేసి సినిమా బావుందని అనేవారు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమా డిఫరెంట్‌గా ఉందని చాలా మంది ఫోన్ చేసి అభినందించారు. ఈ జర్నీ, ఎక్స్‌పీరియెన్స్ ఎప్పటికీ మరచిపోలేను. వంశీగారితో పనిచేస్తే ఎవరైనా ఆయనకు అడిక్ట్ అయిపోతారు. అలా నేను కూడా ఆయనకు అడిక్ట్ అయిపోయాను. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా గర్వంగా భావిస్తున్నానని సుమంత్ అశ్విన్ తెలిపారు. ఒక మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన వంశీగారికి, మధురశ్రీధర్‌గారికి థాంక్స్. మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్ ఇది అని అనీషా అంబ్రోస్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com