వంశీ మార్కు 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'

  • IndiaGlitz, [Tuesday,May 23 2017]

సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించిన చిత్రం 'ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్'. వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మాత‌. జూన్ 2న విడుద‌ల కానుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వినాయ‌క్ రిలీజ్‌డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

వంశీగారు, మ‌ణిశ‌ర్మ‌గారి కాంబినేష‌న్ అంటే చాలా ఇష్టం. కాబ‌ట్టి ఒక అభిమానిగా సినిమా చేశాను. దీంతో నా క‌ల నిజ‌మైంది. మ‌ణిశ‌ర్మ‌గారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. నా మ‌ధుర ఆడియో ఆల్బ‌మ్స్‌లో ఇదే బెస్ట్ ఆల్బ్ అనుకుంటున్నాను అని మ‌ధుర శ్రీధ‌ర్ తెలిపారు. లాభ‌న‌ష్టాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసే నిర్మాత‌ల్లో మ‌ధుర శ్రీధ‌ర్ ఒక‌రు. ఆయ‌న‌కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఎం.ఎస్‌.రాజుగారి అబ్బాయి పెద్ద స్టార్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంశీగారు, ఇళ‌య‌రాజాగారి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సాంగ్స్ ఎప్ప‌టికీ ఫ్రెష్‌గానే ఉంటాయి. అలాగే ఇప్పుడు వంశీగారు, మ‌ణిశ‌ర్మ‌గారి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ పాట‌లు కూడా అంతే ఆద‌ర‌ణ పొందుతాయి. లేడీస్ టైల‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ఎన్నిసార్లు ఆ సినిమాను చూశామో నాకు తెలియ‌దు. వంశీగారి మేకింగ్ ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. ఆయ‌న‌దొక ప్ర‌త్యేక‌మైన శైళి అని వి.వి.వినాయ‌క్ అన్నారు. ఈ సినిమాలో ప‌నిచేసిన అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.

ఈ సినిమాకు వంశీగారి ఫ్యాన్‌లా ప‌నిచేశాను. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ స‌మయంలో వంశీగారి లేడీస్ టైల‌ర్‌, ఏప్రిల్ 1 విడుద‌ల చూసి ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సెకండ్ షెడ్యూల్ సమ‌యంలో సితార‌, అన్వేష‌ణ సినిమాలు చూసి వంశీగారిని ఆరాధించ‌డం మొద‌లు పెట్టాను. ఇక మ‌ణిశ‌ర్మ‌గారు గురించి స్పెష‌ల్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కంపోజ్ చేసిన సినిమాల్లో ఖుషీ సినిమా సాంగ్స్‌ను ఓ వెయ్యి సార్లు చూసుంటాను. ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఇచ్చారు. మ‌ధుర శ్రీధ‌ర్‌గారు సినిమాతో పాటు ఈ ఆడియో వేడుక‌ను కూడా గ్రాండ్‌గా చేశారు. వంశీగారితో సినిమా చేయ‌డం నా అదృష్టం.ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ వంశీగారి నుండి కాస్తా నేర్చ‌కున్నాను. అలాగే వేడి వేడి దోసెలు ఎలా తినాలో నేర్చుకున్నాను. కెమెరా డిపార్ట్‌మెంట్‌, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చాలా స‌హా అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రికీ థాంక్స్ అని హీరో సుమంత్ అశ్విన్ తెలిపారు. '

మ‌న ఎం.ఎస్‌.రాజుగారి అబ్బాయి సుమంత్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాల‌ని భావిస్తున్నాను. వంశీగారు పాతికేళ్ల ముందు సూప‌ర్‌హిట్ మూవీని ఆనందంగా ఉంది. మ‌ణిశ‌ర్మ‌గారు మ్యూజిక్ వింటుంటేనే సినిమా పెద్ద హిట్ ఖాయ‌మ‌ని అర్థం అవుతుంది. ఫ్యాష‌న్ డిజైన‌ర్ ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలంటే సినిమా మంచి ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్థం అవుతూనే ఉంది. మ‌ధుర‌శ్రీధ‌ర్ క‌మిట్‌మెంట్‌, డేడికేష‌నే ఆయ‌న్ను నెక్స్‌ట్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌ని భావిస్తున్నానని ల‌గ‌డ‌పాటి శ్రీద‌ర్ చెప్పారు.

పాతికేళ్ళ త‌ర్వాత లేడీస్ టైల‌ర్ కొడుకును క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. పాతికేళ్ళ ముందు లేడీస్ టైల‌ర్ ఓ సంచ‌ల‌నం. అన్నింటి ప‌రంగా వంశీ ప్ర‌భంజ‌నం అలా కొన‌సాగింది. ఆ స్క్రిప్ట్ అర‌కులో మొద‌లై గోదావ‌రిలో పూర్తైంది. వంశీగారికి గోదావ‌రి అంటే చాలా ఇష్టం. ఆయ‌న రాసుకునే క‌థ‌ల‌న్నీ గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటాయి. ఆయ‌న‌తో చాలా పెద్ద జ‌ర్నీ చేశాను. లేడీస్ టైల‌ర్ అంద‌రీ ఎఫెక్ట్‌. అందువ‌ల్లే ఇప్ప‌టికీ ఆ సినిమా జ్ఞాప‌కాలు మిగిలిపోయాయి. నా కెరీర్‌ను మ‌లుపు తిప్పిన సినిమా. సుమంత్‌కు ఇదొక ట‌ర్నింగ్ పాయింట్ కావాలి. వంశీగారు మ‌ళ్ళీ విజృంభించాలని త‌నికెళ్ళ భ‌ర‌ణి తెలిపారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, బి.గోపాల్‌, బివిఎస్‌.ర‌వి స‌హా అతిథులంద‌రూ సినిమా పెద్ద హిట్ కావాల‌ని యూనిట్‌ను అభినందించారు.

More News

శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ప్రీమియర్ షోస్ కు అనూహ్య స్పందన

గాయత్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కెఎన్.రావ్ నిర్మాణంలో, నరేష్ పెంట దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట. ఈ నెల 26న ఈ చిత్రం విడుదలౌతోంది.

భ్రమరాంబ క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను - రకుల్ ప్రీత్ సింగ్

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం'.

ఆడవాళ్ళపై నోరు జారిన చలపతిరావు

సీనియర్ నటుడు ఎన్నో సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన సీనియర్ యాక్టర్ చలపతిరావును అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.

ముస్తాబవుతున్న గువ్వ గోరింక

వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో.. పూర్తి సహజమైన పాత్రలతో..

ముగాంబికను దర్శించుకున్న అనుష్క

దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరైన అనుష్క ఇప్పుడు ఓ రకంగా వివిఐపి స్టేటస్ను అనుభవిస్తుందనుకోవాలి. అందుకు కారణం బాహుబలి-2. దేవసేనగా బాహుబలి-2లో మెప్పించిన అనుష్క బయట మాత్రం చాలా డీసెంట్గా కనపడతుంది.