రిలయన్స్ జియోపై యుద్ధం ప్రకటించిన రైతులు..
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధానికి దిగిన రైతులు తాజాగా రిలయన్స్ కంపెనీపై తమ యుద్ధాన్ని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే రిలయన్స్ వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగానే ఉందని విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వానికి చెందిన కీలక సంస్థలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం చిన్నగా రిలయన్స్ చేతుల్లో పెట్టేస్తోందనే సామాన్య ప్రజానీకంలోనూ వ్యక్తమవుతోంది. దీంతో అసలు మూలాలపై దెబ్బ కొడితే కానీ ప్రభుత్వం దిగి రాదన్న యోచనకు రైతులు వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి.. పంట ఉత్పత్తుల సేకరణ, పంపిణీ మొదలైన వాటితో ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ గ్రూపులకు ఎలాంటి సంబంధమూ లేదు.
అయితే వారిరువురి కంపెనీలకూ భారీగా లబ్ధి చేకూర్చే క్రమంలోనే ప్రభుత్వం కొత్త సాగుచట్టాలను తీసుకు వచ్చేందనే అభిప్రాయమైతే సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే రిలయన్స్ జియోపై రైతన్నలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కార్పొరేట్లు తమ భూములను లాగేసుకుంటాయని ఇప్పటికే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ కార్పొరేట్లకు ప్రతినిధులుగానే అంబానీ, అదానీలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు రిలయన్స్ సంస్థల్లో కీలకమైనదైన జియోపై దృష్టి సారించారు. రిలయన్స్ జియోకు చెందిన 1338 సిగ్నల్ టవర్ల సైట్లను ధ్వంసం చేశారు. గడచిన 24 గంటల వ్యవధిలోనే 151 టవర్లను, అవి ఉన్న సైట్లను ‘ఆందోళనకారులు’ నాశనం చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.
కాగా.. ప్రైవేటు ఆస్తులను, కార్పొరేట్లను టార్గెట్ చేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేస్తున్న విజ్ఞప్తులను సైతం రైతులు పెడచెవిన పెట్టారు. అయితే వీరంతా రైతులేనని చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే దీనికి రైతుల ప్రోత్సాహైతే ఉందని అనుమానిసన్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ను కత్తిరించేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన రిలయన్స్ జియో.. ఒక్క రోజులో 200 పైచిలుకు చోట్ల నెట్వర్క్ను ధ్వంసం చేయడం వల్ల కనెక్టివిటీ తెగిపోయిందని, ఈ సైట్లలో సుమారు రూ.40కోట్ల దాకా నష్టం వాటిల్లిందని పేర్కొంది. రైతుల పేరిట కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, తగిన భద్రతనివ్వాలని 23వ తేదీనే పంజాబ్ డీజీపీకి లేఖ రాశారు. దీంతో డీజీపీ పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments