మొక్కలు నాటిన ఫరియా అబ్దుల్లా .. ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టిలకు ఛాలెంజ్
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సినీ నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఫిలింనగర్ శనివారం ఆమె మొక్కలు నాటారు. అనంతరం ఫరియా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వి మేఘనకు ఫరియా చాలెంజ్ విసిరారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. జాతి రత్నాలతో ఈ ఇయర్ బంపర్ హిట్‌ను అందుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి ప్రస్తుతం.. కింగ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్యలతో కలిసి స్టెప్పులేసింది. ‘బంగార్రాజు’ చిత్రంలో ఆమె ప్రత్యేక గీతంలో నటించింది. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని మూడో పాట ‘‘వాసివాడి తస్సాదియ్య’’ గత వారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
'ఓయ్... బంగ్గారాజు! నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు? అంటూ సాగే ఈ పాటను మోహనా భోగరాజు, సాహితీ చాగంటి, హర్షవర్ధన్ చావలి అలపించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్వయంగా రాశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com