దీప్వీర్లకు ఫరాఖాన్ సర్ప్రైజ్
Send us your feedback to audioarticles@vaarta.com
రణవీర్ సింగ్, దీపికా పదుకొనెలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలుచెబుతున్నారు. ఈ సందర్భంలో దర్శకురాలు ఫరాఖాన్ దీపికకు రెండు చేతులు పట్టుకున్న.. అంటే ఒక చేయిని మరో చేయి పట్టుకున్న బొమ్మను గిఫ్ట్‌గా అందించారట. దీపికను ఫరాఖాన్ తన చిత్రంతో చిత్ర సీమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఆమెను పెళ్లికి ఆహ్వానించడానికి దీపిక, రణవీర్‌లు ఇంటికి వెళితే వారి చేతి కొలతలను తీసుకుని ప్రముఖ లైఫ్ స్టైల్ కళాకారిణి భావనా జస్రాకు ఇచ్చి అందమైన ప్రతిమను చేయించారట ఫరాఖాన్. దాన్ని దీప్వీర్లకు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇలాంటి గిఫ్ట్ రావడంతో దీప్‌వీర్‌లు సర్ప్రైజ్ అయ్యారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments