నిధి అగ‌ర్వాల్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అభిమానులు

  • IndiaGlitz, [Monday,February 15 2021]

అభిమానం విప‌రీతానికి చేరుకుంటే ఏమంటారు?.. పిచ్చి అనే అంటారు. కానీ ఇత‌రుల‌కు న‌ష్టం క‌లిగించనంత వ‌ర‌కు ఎవ‌రి పిచ్చి వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు త‌మిళ‌నాడులో కొంద‌రు ఇలాగే అంటున్నారు. మా పిచ్చి మాకు ఆనందం అంటున్నారు. ఇంత‌కీ అలా అంటున్న వారెవ‌రో తెలుసా? నిధి అగ‌ర్వాల్ అభిమానులు. వివ‌రాల్లోకి వెళితే.. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా అంద‌రూ ప్రేమికులు త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకున్నారు. అయితే త‌మిళ‌నాడులో కొంద‌రు త‌మ అభిమాన న‌టి నిధి అగ‌ర్వాల్‌కు వేలంటైన్స్ డే సంద‌ర్భంగా చెన్నైలోని కోడంబాక్కంలోని కొంద‌రు అభిమానులు గుడి క‌ట్టి పాలాభిషేకాలు చేసిన పూజలు నిర్వ‌హించారు. అస‌లు నిధి అగ‌ర్వాల్‌కు త‌మిళ‌నాడులో అంత మంది అభిమానులు ఎలా వ‌చ్చారు? అనే సందేహం రాక‌మాన‌దు. అయితేనేం.. ఎవ‌రి పిచ్చి వారికి ఆనందం. అభిమానానికి హ‌ద్దులు ఉండ‌వు.

మున్నా మైకేల్ అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నిధి అగ‌ర్వాల్ త‌ర్వాత తెలుగులో మిస్ట‌ర్ మ‌జ్ను, స‌వ్య‌సాచి, ఇస్మార్ట్ శంక‌ర్ వంటి తెలుగు చిత్రాల‌తో పాటు, భూమి, ఈశ్వ‌ర‌న్ వంటి త‌మిళ చిత్రాల్లోనూ న‌టించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది నిధి అగ‌ర్వాల్‌.