పవన్ కీలక నిర్ణయంతో షాక్‌లో ఫ్యాన్స్!?

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. అయితే తెలంగాణలో అంతంత మాత్రమే ఉన్న పార్టీలు సైతం ఉనికిని కాపాడుకుని.. ఈ ఎన్నికల్లో అయినా అదృష్టం కలిసొస్తుందేమోనని సిద్ధమవుతున్నాయ్. వాటిలో ముఖ్యంగా టీడీపీ, తెలంగాణ జనసమితి, వామపక్షాలు, బీజేపీలు ఉన్నాయ్. ముఖ్యంగా తెలంగాణ వరకూ అయితే కాంగ్రెస్-టీఆర్ఎస్‌ పార్టీల మధ్యే గట్టిపోటీ ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఒప్పుకున్నారు కూడా.!.

చంద్రబాబు సై అనేశారుగా..!
ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పత్తా లేకుండా పోయింది.. సైకిల్ గుర్తుపైన గెలిచిన వాళ్లు.. పార్టీకి సంబంధించిన వాళ్లు ఎంతమందున్నారనేది వేళ్ల మీద లెక్కలేసి చెప్పేయచ్చు.. ఇదీ పార్టీ పరిస్థితి. అయితే ఇలాంటి పార్టీ కూడా మునిపల్ ఎన్నికల బరిలోకి దిగి ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పోటీ విషయమై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉన్న కొద్దిమంది నేతలతో సమావేశం కావడం.. అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగిపోయింది. అంతేకాదు.. ఎన్నికల ప్రచారం కూడా షురూ చేశారు. అంటే చంద్రబాబు ఈ ఎన్నికల్లో సై అనేశారన్న మాట.

జనసేన ఎందుకో ఇలా!
తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ పరిస్థితేం అంత బాగోలేదన్న విషయం పవన్ ఫ్యాన్స్‌కు కూడా బాగా తెలుసు.!. ఈ పార్టీని ఇప్పుడిప్పుడే బలోపేతం చేసుకోవాల్సిన పవన్ కల్యాణ్ అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకోలేదని తాజా పరిస్థితులను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు దూరంగా పవన్.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగిన సంగతి తెలిసిందే. అయితే.. మునిసిపల్ ఎన్నికల్లో మాత్రం పోటీచేయడానికి సాహసించట్లేదు. పార్టీ గుర్తుపై పోటీ చేయొద్దు కానీ.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయండని ఇందుకు పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని జనసేన ప్రకటించడం గమనార్హం. జనసేనాని ప్రకటనతో కార్యకర్తలు, వీరాభిమానులు కంగుతిన్నారట. అన్ని అవకాశాలు ఉండి కూడా పవన్ ఎందుకిలా చేస్తున్నారో అభిమానులకే అర్థం కావట్లేదట.

ఎందుకిలా చేస్తున్నారో.. షాక్‌లో ఫ్యాన్స్!
తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో పవన్‌కు ఫ్యాన్స్‌, కార్యకర్తలకు కొదువలేదు.. మరోవైపు కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఇలా చెప్పుకుంటే దాదాపు అన్ని జిల్లాల్లో పవన్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పవన్ మాత్రం వారిని సరిగ్గా వాడుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఇలాంటి లోకల్ బాడీ ఎన్నికల ద్వారానే పార్టీని బలోపేతం చేసుకునేందుకు మంచి అవకాశముంది కానీ.. పవన్ మాత్రం ఆ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం ఆయన అభిమానులు, కార్యకర్తలు షాకయ్యారట. అసలెవడ్రా బాబూ.. పవన్‌కు ఇలాంటి సలహా ఇచ్చిందని కార్యకర్తలు తిట్టి పోస్తున్నారట. మరి ఇలాగే అవకాశాలన్నీ వినియోగించుకోకుండా సైలెంట్‌గా ఉండిపోతే మున్ముంథు పరిస్థితి ఎలా ఉంటుందో పవన్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More News

‘సరిలేరు’లో రాములమ్మ రెమ్యునరేషన్ ఎంతంటే..!

‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ వంటి చిత్రాలతో జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్‌ విజయశాంతి సంచలనం సృష్టించింది.

య‌శ్ క్రేజే వేర‌ప్పా..!

క‌న్న‌డ సినిమా రంగం నుండి ఉపేంద్ర త‌ర్వాత ఇత‌ర సినిమాల మార్కెట్‌లో త‌న‌కంటూ ఇమేజ్ సంపాదించుకున్న న‌టుడు రాక్‌స్టార్ య‌శ్‌.

‘సరిలేరు..’లో సూపర్‌స్టార్ పాత్ర తెలిసిపోయింది!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌,

విల‌న్‌కి ఖ‌రీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో

బాలీవుడ్‌స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ త‌క్కువ మందితోనే క‌లివిడిగా ఉంటాడు. అయితే త‌న మ‌న‌సుకు ఏ మాత్రం ద‌గ్గ‌రైనా వారిని అంత సుల‌భంగా వ‌దులుకోడు.

వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్.. రాజ్యసభకు చిరు!!

ఇదేంటి.. టైటిల్ చూడగానే షాకయ్యారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయ్.