గాడ్సేను దేశభక్తుడన్న నాగబాబు.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ట్వీట్ చేశారు. ఇవాళ గాడ్సే పుట్టిన రోజు కావడంతో నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. దీంతో నెటిజన్లు, జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు జనసేన కార్యకర్తలయితే దుమ్మెత్తి పోస్తున్నారు. వివాదాల కోసమే ఇలా చేస్తున్నారా..? లేకుంటే మీరు చేయాల్సిన పనులేమీ లేవని ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారా..? అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు.. ఈ ట్వీట్‌తో సినీ, రాజకీయ వర్గాల్లో కొత్త చర్యలు మొదలయ్యాయి. కాగా.. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సొంత అభిమానులే తిట్టిపోస్తుండటం గమనార్హం.
అసలేం ట్వీట్ చేశారు..!?
‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా..? కదా..? అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు ఆర్గుమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవాలి అని నాకు అనిపించింది. పాపం నాధురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అని నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. కాగా వివాదాస్పద ట్వీట్స్ చేయడం నాగబాబుకు ఇదేం కొత్త కాదు ఇప్పటికే పలు మార్లు హిందువులపై కామెంట్స్ చేసి కూడా విమర్శలపాలయ్యారు.
నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ ఇవి..
‘అపఖ్యాతి పాలవుతాను అని తెలిసినా తాను అనుకున్నది చేసాడు అంటే.. ఒక ముస్లిం ఉగ్రవాది కూడా నమ్మిన సిద్ధాంతం కోసం వాడు చస్తాను అని తెలిసినా అనుకున్నది చేస్తాడు.. అది దేశభక్తేనా...ఎం బాబు ఏం మాట్లాడతారో ఆలోచించుకోండి’ అని కొందరు.. ఇంకొందరు.. ‘టాలీవుడ్‌లో పనికి రాని చెత్త ఏదైతే ఉందో అది నువ్వు మాత్రమే’ అని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇక చాలు ఆపండి..!
‘ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం.. రాజకీయంకి సంబంధం లేనీ ట్వీట్లు వేయడం వల్ల 2019 ఎన్నికల్లో మన పార్టీ సిద్ధాంతం జనాలోకి వెళ్ళలేదు. మీరు ఎలాగు పార్టీకి నిలబడలేరు. గోపిల్లాగా ఉంటున్నారు. కొంచెం సబ్జెక్ట్ మీద మాట్లాడటం పార్టీకి మంచిది. 2009, 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొండి. మీ మాటలు ఎలా ఉన్నాయంటే ‘కసబ్ కూడా మంచి వాడే.. పాపం తను నమ్మిన సిద్దాంతం కోసం యుద్ధం చేశాడు. తన దేశభక్తిని శంకించలేం’ అన్నట్లుంది. బీజేపీని తిట్టడం.. మళ్ళీ కలవడం.. ఏదో సర్దుకుపోయాం. మరీ ఇంతలా కలవక్కర్లేదు. మీ వల్ల మళ్ళీ జనసైనికులు గౌరవం పోయేలా చేస్తున్నారు.. ఆపండి అన్న..’ అని ఓ మెగాభిమాని కామెంట్స్ చేయడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout