ఎన్టీఆర్ ప్రసంగిస్తుండగా.. ‘సీఎం సీఎం’ అంటూ అభిమానుల నినాదాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్నకుమారుడు శ్రీసింహా కోడూరి ‘మత్తు వదలరా’ తరువాత హీరోగా నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ ను చూడగానే అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. ఎన్టీఆర్ ప్రసంగిస్తుండగా అభిమానులంతా ‘సీఎం, సీఎం’ అంటూ నినాదాలు చేశారు. తారక్ ఓవైపు కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవ గురించి మాట్లాడుతుండగా, అభిమానులు మాత్రం సీఎం నినాదాలతో హోరెత్తించారు.
దీంతో తారక్.. కొంత అసహానానికి గురైనట్టు తెలుస్తోంది. ‘ఆగండి బ్రదర్, ఆగమని చెప్తున్నాను కదా’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తనకెంతో ఇష్టులైన కీరవాణి కుటుంబసభ్యుల గురించి మాట్లాడుతున్నటప్పుడు సీఎం అంటూ అభిమానులు కోలాహలం సృష్టించడం ఎన్టీఆర్ అసహానానికి కారణమైంది. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే.. నాకు దేవుడిచ్చిన కుటుంబం.. నాకు తెలిసిన ఒకే ఒక్క కుటుంబం మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం. నా మంచి చెడుల్లో.. నా కష్ట సుఖాల్లో.. నేను జీవితంలో తీసుకన్న ప్రతి నిర్ణయం వెనుకా పరోక్షంగానూ.. ప్రత్యక్షంగానూ ఉన్న ఒకే ఒక్క కుటుంబం అది మా కీరవాణి గారి, జక్కన్న గారి కుటుంబం.
నేనిక్కడకు ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను. నేను ఏ రోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాదు.. కాలేదు.. కాకూడదు కూడా. అలాగే ఈ రోజు మా సాయన్న గురించి మాట్లాడాలంటూ కూడా అదే ఇబ్బంది పడుతున్నా. నాకు ఏడేళ్లున్నప్పటి నుంచి ఆయన పరిచయం నాకు. ఆగండి బ్రదర్, స్టాప్(సీఎం, సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేస్తుంటే) నాన్న గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి, సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం. సినిమా సక్సెస్ అవ్వాలి.. మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దొహదపడాలి. ఈ మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments