Prabhas:ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్.. బ్లాక్‌బాస్టర్‌గా సలార్..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రపంచవ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. ఒక్క సాహో చిత్రం మాత్రమే యావరేజ్‌గా నిలిచింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ బాహుబలి స్థాయి లాంటి సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించిన 'సలార్(Salaar)' మూవీ ఫుల్ స్టాప్ పెట్టిందా..? భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్ ఎలా ఉంది..? అభిమానుల అంచనాలను అందుకుందా..? ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా..? అంటే అవుననే చెబుతున్నారు.
1995 నేపథ్యంలో సాగే చిన్నారుల స్నేహం నేపథ్యంలో కథ మొదలవుతుంది. దేవా వాగ్దానంతో సలార్ టైటిల్ కార్డు పడుతుంది. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సీన్‌లో ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్ అరవకుండా ఉండలేరు. అంత భారీ ఎలివేషన్‌తో ఎంట్రీ సీన్ ఉందంటున్నారు. ఓ వైపు ప్రభాస్ వయెలెన్స్.. మరోవైపు పృథ్విరాజ్ సుకుమారన్‌తో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయంటున్నారు. ఇక ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుదంని చెబుతున్నారు. మొత్తానికి ప్రభాస్ ఖాతాలో మరో రూ.1000 కోట్ల సినిమా సలార్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నారు. మరి బాక్సాఫీస్‌పై సలార్ దండయాత్ర ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కనివీని ఎరుగని రీతిలో జరిగాయి. అర్థరాత్రి ఒంటి గంటకే బెనిఫిట్ షోలు పడటంతో ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర రచ్చరచ్చ చేశారు. మూవీ హిట్ టాక్ అందుకోవడంతో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా సలార్ మాన్‌స్టర్ హిట్ అంటూ ట్వీట్ పెట్టారు. ప్రభాస్ అన్నకు మరో బ్లాకబాస్టర్ పడిందని.. సినిమా తప్పకుండా చూడాలని తెలిపారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లన్ని 'సలార్' మేనియాతో ఊగిపోతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout